ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు టూ టౌన్ సీఐ ప్రభాకర్ స్టేషన్ లో రౌడీ షీటర్ లకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రౌడీ షీటర్ లు సత్ప్రవర్తనతో జీవించాలని, అసాంఘిక కార్యకలాపాల వైపు వెళ్లకూడదన్నారు. ఎక్కడైనా, ఎవ్వరైనా ప్రజా శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.