జిల్లాలో అధిక వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలలోని ప్రజలను రక్షించేందుకు జిల్లా యంత్రాంగం అహర్నిశలు నిరంతర చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉందని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. బుధవారం కలెక్టర్ , జిల్లా ఎస్పీ కె పి ఎస్ కిషోర్ తో కలిసి కైకలూరు, మండవల్లి మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువులను వారి వద్దకే అందించే ఏర్పాట్లను చేస్తామన్నారు.