బుసక నిల్వలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ నుండి వేరే ప్రాంతాలకు లారీ టిప్పర్లతో తరలిస్తున్నారని, దీనివలన రోడ్లు పాడైపోతున్నాయని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. కైకలూరు ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు తరలించడానికి టిప్పర్లు వినియోగిస్తున్నారని, టిప్పర్లు ద్వారా బుసక తరలిస్తే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటారని లారీని సీజ్ చేస్తారని అన్నారు.