గురువుకు గౌరవం దక్కినప్పుడే సమాజం బాగుంటుంది

65చూసినవారు
గురువుకు గౌరవం దక్కినప్పుడే సమాజం బాగుంటుంది
గురువులకు సముచిత గౌరవం దక్కినప్పుడే సమాజం బాగుంటుందని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. కలిదిండి మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద శుక్రవారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఈవోలు రవిప్రకాశ్, నరేశ్ కుమార్ లు మాట్లాడుతూ వరదల నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేసి ఇప్పుడు జరుపుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మండల ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్