అంతరిక్ష కార్యక్రమం కేవలం రాకెట్లు, ఉపగ్రహాల గురించి మాత్రమే కాదని, వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడం ద్వారా భవిష్యత్ తరాలు స్థిరమైన, సురక్షితమైన, పూర్తి అవకాశాలతో కూడిన ప్రపంచాన్ని వారసత్వంగా పొందేలా చేయడమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఆదివారం భీమవరం బివి రాజు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసినప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు - 2024 ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.