మొగల్తూరు గ్రామంలోని గొల్లగూడెం నుండి వెంప వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురియండంతో రోడ్డంతా బురదమయంగా మారింది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.