నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం యధావిధిగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నరసాపురం ఆర్డీవో దాసిరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్లోని అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని వివరించారు. కావున ప్రజలు తమ ఫిర్యాదులు, దరఖాస్తులను ఉదయం 10: 30 గంటల నుంచి అందించాలని కోరారు.