నూజివీడు పోలీసు సర్కిల్ పరిధిలోని చాట్రాయి మండలం చిత్తూరు గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ బి.నాగరాజు అనారోగ్యం తట్టుకోలేక తల నొప్పికి సంబంధించిన మందు బిళ్ళలు మింగి ఆత్మహత్యాయత్నానికి బుధవారం పాల్పడ్డాడు. ఈ మేరకు నూజివీడు ఆసుపత్రిలో నాగరాజు భార్య పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ప్రస్తుతం ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నట్లుగా హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరావు తెలిపారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.