సౌండ్ సిస్టం హెచ్చుతగ్గులు పెట్టే విషయంలో చెలరేగిన తగాదాలో ఐదుగురు వ్యక్తులపై మరి కొంతమంది దాడి చేసినట్లు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలోని ఆగిరిపల్లి మండలం పోతవరపాడుకి చెందిన లింగవరపు వెంకటేశ్వరరావు, అతని బంధువులు పై అదే గ్రామానికి చెందిన కలపాల జోజి తదితరులు దాడి చేసినట్లు ఫిర్యాదు వచ్చిందని ఏఎస్ఐ శేఖర్ తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నట్లుగా వివరించారు.