ప్రజల రేపటి ఆకాంక్షలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక విన్నూత్న కార్యక్రమాలను శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. అనంతరం మంత్రి సభ లో మాట్లాడారు.