నూజివీడు మున్సిపాలిటీ గత మూడు నాలుగు సార్లుగా వైసిపి పార్టీ నే గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. సోమవారం నూజివీడు వైసిపి కార్యాలయంలో వైసిపి కౌన్సిలర్లతో కలిపి మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిడిపికి ఏడు సీట్లు వస్తాయని ఆయన విమర్శించారు. 30 సీట్లు అప్పుడు ఏడు సీట్లు వచ్చాయని 32 సీట్లు అప్పుడు ఏడు సీట్లు వచ్చాయని రాజకీయంగా విమర్శించారు.