నూజివీడు నియోజకవర్గం పెన్షన్ల పంపిణీ మంగళవారం తెల్లవారుజాము నుండి ప్రశాంతంగా సాగుతుంది. నూజివీడు మండలం రావిచెర్ల గ్రామంలో నూజివీడు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, రావిచెర్ల సర్పంచ్ కాప శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. వివిధ మండలాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ జరుగుతుంది.