పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించి మండలాన్ని అభివృద్ధి చేయాలని ఎంపీపీ నిర్మల అన్నారు. సోమవారం చాట్రాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయం సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ లంకా నిర్మల మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టుగా గర్భిణీ స్త్రీలకు నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 102 అంబులెన్స్ ప్రవేశ పెట్టిన్నట్లు తెలిపారు.