పాలకొల్లు: జిల్లాలోనే అధికంగా 873 దరఖాస్తులు

73చూసినవారు
పాలకొల్లు: జిల్లాలోనే అధికంగా 873 దరఖాస్తులు
పాలకొల్లు ఎక్సైజ్ పరిధిలో పాలకొల్లు పట్టణంలో 7, పాలకొల్లు మండలంలో 4, పోడూరు మండలంలో 4, ఆచంట మండలంలో 4, మొత్తం 19 మద్యం షాపులకు గాను 873 దరఖాస్తులను స్వీకరించినట్లు పాలకొల్లు ఎక్సైజ్ సీఐ మద్దాల శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కొక్క దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున 873 దరఖాస్తులకు అక్షరాల రూ. 17కోట్ల 46 లక్షలను, దరఖాస్తు దారులు రుసుముగా ప్రభుత్వానికి చెల్లించడం జరిగిందని సీఐ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్