పాలకొల్లు మండలం లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కాపవరంలో డాక్టర్ అడ్డాల ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో ఎఫ్పిసి క్యాంపును జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ స్వరూప్ బుధవారం సందర్శించారు. గ్రామంలో సిడిఎన్సిడి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపి, పిహెచ్సిలో జరుగుతున్న ప్రసవాలు వివరాలు అడిగి రికార్డులు పరిశీలించారు.