పశ్చిమగోదావరి జిల్లాలో గడచిన 24 గంటల్లో 53. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లాలో అత్యధిక వర్షపాతం ఎలమంచిలి మండలంలో 12. 4 మిల్లీమీటర్ల నమోదుకాగా. అత్యల్ప వర్షపాతం తాడేపల్లిగూడెం మండలంలో 0. 4 మిల్లీమీటర్లుగా నమోదయింది. అలాగే జిల్లాలో సగటు వర్షపాతం 2. 7 మిల్లి మీటర్లుగా నమోదయింది.