పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు డిమాండ్ చేశారు. యలమంచిలి మండలంలో బుధవారం వివిధ గ్రామాలలో పర్యటించి పంచాయతీ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాలు మారిన పంచాయతీ కార్మికుల వెతలు తీరలేదన్నారు. స్వీపర్లు, ఎలక్ట్రిషన్లు, ట్యాంక్ వాచర్లు, బిల్లు కలెక్టర్లు కనీస వేతనాలు లేకుండానే విధులు నిర్వహిస్తున్నారన్నారు.