పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో సోమవారం రూ.5. 25 లక్షల నగదుని సీజ్ చేశారు. సోమవారం కంకిపాడు లాకు రోడ్డులో ఆకస్మికంగా జరిపిన వాహన తనిఖీల్లో విజయవాడకి చెందిన వీరంకి గోపీకృష్ణ వద్ద నుంచి రూ.5. 25 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వి శ్రీనివాస్ తెలిపారు. నగదుకు సంబంధించి గోపీకృష్ణ సరైన పత్రాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు తెలిపారు.