జగ్గయ్యపేట నియోజకవర్గంలోని రుద్రవరం, సోమవరం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జగ్గయ్యపేట నియోజకవర్గ టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పర్యటించారు. ఈ సందర్భంగా టిడిపి, బిజెపి, జనసేన పార్టీల నాయకులతో కలిసి గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపించారు.