ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల మెయింటెనెన్స్, ఛార్జింగ్ మినహా ఆపరేషన్స్ అంతా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టం చేసింది. ఇవాంటి వార్తలు కేవలం కల్పితాలేనని, ప్రజలు నమ్మవద్దని కోరింది.