పామర్రు నియోజకవర్గం శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పామర్రు మండలం జమిదగ్గుమిల్లి గ్రామంలో అనిల్ కుమార్ సతీమణి లీనా, కంచర్లవానీపురంలో అనిల్ కుమార్ సోదరుడు జగదీష్,
పమిడిముక్కల మండలం ఆగినపర్రు, మామిళ్లపల్లి గ్రామాలలో సోదరి అనిత, పెదపారుపూడి మండలం ఈదులమద్దాలిలో అనిల్ కుమార్ గా తల్లి జ్ఞానమణి ప్రచారంలో పాల్గొన్నారు.