దేశంలోనే ధనిక ఎంపి(గుంటూరు) అభ్యర్థిగా బరిలోకి దిగిన డా. పెమ్మసాని చంద్రశేఖర్ కంకిపాడు మండలం గొడవర్రుకు చెందిన అల్లుడు. గొడవర్రుకు చెందిన కోనేరు రత్నశ్రీను చంద్రశేఖర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో వీరి పరిచయం ప్రేమకు తర్వాత పెళ్లికి దారితీసింది. పెమ్మసాని తన నామినేషన్ అఫిడవిట్లో ఆస్తులు రూ. 5, 705 కోట్లు అప్పులు రూ. 1, 038 కోట్లుగా చూపించారు.