భూ వివాదం ఘటనపై కేసు నమోదు

72చూసినవారు
భూ వివాదం ఘటనపై కేసు నమోదు
జీలుగుమిల్లి మండలం పి. అంకంపాలెం రెవెన్యూ పరిధిలో కొరుటూరు నిర్వాసితులకిచ్చిన ఆర్ అండ్ ఆర్ భూమిలో పరికరాలు, మొక్కలు ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ నిర్వాసితుల భూముల్లోకి అక్రమంగా చొరబడిన గిరిజనులు, వారిని రెచ్చగొట్టిన ఓ నాయకుడిపై కేసు నమోదు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్