కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నడిచి వెళుతున్న మహిళను టిప్పర్ లారీ ఢీకొట్టడంతో గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.