ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామసభల ద్వారా గ్రామాలలోని సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. అనంతరం ప్రజల నుండి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు స్వీకరించారు.