పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటిని పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ప. గో. జిల్లా ప్రధాన కార్యదర్శి కారటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ పాల్గొన్నారు.