తాడేపల్లిగూడెం పట్టణంలోని బేబీ సెంటర్ రోడ్లో మంగళవారం ఉచిత డయాబెటిస్ క్యాంపు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బావాజీ శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల అన్ని వయస్సుల వారిలో మధుమేహం వ్యాప్తి చెందుతుందన్నారు. శరీరానికి వ్యాయామం తప్పనిసరి అని సూచించారు. అనంతరం తొమ్మిది రకాల పరీక్షలు జరిపారు. వైద్యులు నర్మద, సురేంద్ర, అఖిల, పద్మిని తదితరులు పాల్గొన్నారు.