తాడేపల్లిగూడెం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసియున్న శ్రీ దక్షిణాముఖ సువర్చల సుందర అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమద్ర్వత ఉత్సవాలు ముగిసాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆదివారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు విరివిగా తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తొలుత స్వామివారికి అన్న ప్రసాద నివేదన చేశారు. అనంతరం ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.