తణుకు మండలం వేల్పూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామంలోని పలువురు గర్భిణీ మహిళలకు ఏర్పాటు చేసిన శ్రీమంతం వేడుకలో వారికి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అధికారం చేపట్టిన తొలి 100 రోజుల్లోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అన్నారు.