మహిళలు, విద్యార్థినిలపై జరుగుతున్న దాడులు అరికట్టి, రక్షణ కల్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అడ్డగర్ల అజయ కుమారి విమర్శించారు. సోమవారం కొండాలమ్మ పుంతలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా పోరు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి కరపత్రాల పంపిణి జరిగింది. మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు ఆపాలని, పెరిగిన ధరలు తగ్గించాలని, మహిళా రిజర్వేషన్స్ అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.