ఉంగుటూరు మండలం నారాయణపురం వర్తక సంఘం గణపతి నవరాత్రి ఉత్సవాలు భాగంగా గురువారం రాట వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షులు ఆడప శ్రీనివాస్, బండారు నాగరాజు, దుర్గారావు, గంగాధర్, సంతోష్, డివిడి జయరాం, చిన్న శేఖరం, వర్తక సంఘ సభ్యులు, గణేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.