ఉ.11 గంటల్లోపే ఉపాధి పనులు.. ఆదేశాలు జారీ

56చూసినవారు
ఉ.11 గంటల్లోపే ఉపాధి పనులు.. ఆదేశాలు జారీ
ఏపిలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పనులను ఉ.6 నుంచి 11 గంటల్లోపే ముగించాలని ప్రభుత్వం కలెక్టర్లు, డ్వామా పీడీలను ఆదేశించింది. అవసరమైతే సా.4 నుంచి 6 గంటల వరకు పనులు కొనసాగించాలని పేర్కొంది. పని ప్రదేశాల్లో నీటి వసతి, నీడ ఉండేలా షెడ్స్ ఏర్పాటు చేయాలంది. ప్రథమ చికిత్స కిట్లు, ORS ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్