AP: రాష్ట్రంలో పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం ఒక రోజు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండగా.. తాజా నిర్ణయంతో జూన్ 13న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.