ఏపీలో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకానికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు ప్రకటించనున్నారు. అయితే ప్రతి వినియోగదారుడు తాను ఎక్కడి నుంచైతే గ్యాస్‌ను పొందుతున్నారో సంబంధిత డీలర్ దగ్గరకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని అంటున్నారు. ఆధార్ నెంబర్ ఇచ్చి వేలిముద్ర వేస్తే సరిపోతుంది. ఈకేవైసీ చేయించుకుంటేనే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలవుతుందని అధికారులు చెబుతున్నారు.