ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి (వీడియో)

69చూసినవారు
సెంట్రల్ టర్కీలోని తస్కోప్ర జిల్లాలోని అలతర్ల గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇస్తాంబుల్-సినోప్ రహదారిపై ప్రయాణిస్తున్న ఇంటర్ సిటీ ప్యాసింజర్ బస్సు ప్రమాదానికి గురైంది. మంచు కురుస్తుండటంతో అదుపు తప్పిన బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 33 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్