బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

81చూసినవారు
బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
రాజస్థాన్‌లో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని అక్కడి ప్రభుత్వం శనివారం కాంగ్రెస్ హయాంలో ఏర్పాటైన తొమ్మిది జిల్లాలు, మూడు డివిజన్లను రద్దు చేసింది. రద్దు చేయబడిన డివిజన్లలో పాలి, సికార్, బన్స్వారా డివిజన్లు ఉన్నాయి. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన దూడు, కేక్రి, నీమ్‌కథానా, గంగాపూర్ సిటీ, జైపూర్ రూరల్, జోధ్‌పూర్ రూరల్, అనుప్‌గఢ్, సాంచోర్, షాపురా జిల్లాలను ప్రభుత్వం రద్దు చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్