AP: ప్రకాశం జిల్లాకు చెందిన మాజీమంత్రి శిద్దా రాఘవరావు జనసేనలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 2014లో చంద్రబాబు కేబినెట్‌లో అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా ఆయన సేవలందించారు. 2019లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. తర్వాత వైసీపీలో చేరారు. 2024లో కూటమి ప్రభుత్వం గెలిచాక టీడీపీలో చేరాలనుకున్నా.. అందుకు మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆయనను జనసేనలోకి తీసుకొచ్చేందుకు బాలినేని శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.