ఏపీలోని అనకాపల్లి జిల్లాలో 169 కిలోల గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పాడేరు నుంచి వైజాగ్ గాజువాకలోని ఆటోనగర్‌కు 169 కిలోల గంజాయిని కారులో తరలిస్తుండగా సబ్బవరం రోడ్‌లో పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారుతో పాటు గంజాయి సీజ్ చేశారు.