ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాని మంత్రి ఆవాస్ యోజన 1.0 కింద రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను కొనసాగించి పూర్తి చేయనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. డిసెంబర్ 24కే ఈ పథకం పూర్తవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మార్చి 26 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 6.41 లక్షల ఇళ్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.