కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊరట

68చూసినవారు
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊరట
ఎలక్టోరల్ బాండ్ల కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‎కు భారీ ఊరట దక్కింది. ఎన్నికల బాండ్ల పేరిట కార్పొరేట్ కంపెనీల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై నిర్మలా సీతారామన్, బీజేపీ నేత నళిన్‌కుమార్‌ కటీల్‌ తదితరులపై ఈ ఏడాది సెప్టెంబరులో బెంగళూరులో కేసు నమోదైంది. విచారణలో భాగంగా ఈ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్