ఏపీలో మరో గంజాయి దందా బయటపడింది. కాలేజీ, స్కూలు విద్యార్థులనే టార్గెట్ చేసి గంజాయిని చాక్లెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఓ షాపుపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 175 గ్రాముల గంజాయితో పాటు 400 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన ఉదయానంద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.