AP: నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 3వ తేదీన నారావారిపల్లెలో 20 కంపెనీలు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆవిష్కరించారు. 1200 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. రెండు సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు, కొన్ని ఇండస్ట్రీలో ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.