టెన్త్ విద్యార్థుల ర్యాగింగ్ తాళలేక.. ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

69చూసినవారు
టెన్త్ విద్యార్థుల ర్యాగింగ్ తాళలేక.. ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
TG: టెన్త్ విద్యార్థుల ర్యాగింగ్‌ తాళలేక ఆరో తరగతి విద్యార్థి(12) ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరులోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థులు పనులు చేయాలంటూ ఆరో తరగతి విద్యార్థిని తరచూ వేధిస్తూ, కొడుతుండే వారు. ఆ బాధను తట్టుకోలేక ఆ విద్యార్థి ఎలర్జీ నివారణకు వాడే మందు తాగాడు. గమనించిన సహ విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్