అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో గత గురువారం ఉదయం 10.44 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7కు పైగా నమోదైంది. అయితే ఈ భూకంపానికి ముందు ఓ సరస్సులో ఉన్న పక్షులు పసిగట్టి పైకి ఎగిరిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫెర్న్‌డేల్ పట్టణానికి పశ్చిమాన 39 మైళ్ల (63 కి.మీ) దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.