వైసీపీ బాధ్యతలు వైఎస్ విజయమ్మకు అప్పగించాలని వాసిరెడ్డి పద్మ సూచించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల విశ్వాసం కోల్పోయిన వైఎస్ జగన్ వైసీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆమె పేర్కొన్నారు. విజయవాడలో శనివారం మీడియాతో పద్మ మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి స్కీమ్ వెనుక స్కామ్ నడిపినట్లు ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. వాటిపై సమాధానం చెప్పుకోలేక సీఎం పదవిని వివాదం చేస్తున్నారని దుయ్యబట్టారు.