కేంద్ర ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న వేతన సవరణ సంఘం ప్యానెల్ ఏర్పాటుకు కేంద్రం ఒకే చెప్పింది. దీంతో ఏప్రిల్ 2025లో ఈ ప్యానెల్ ఏర్పాటు కానుంది. ప్యానెల్ సిఫార్సులు 2026 లేదా 2027లో అమల్లోకి రానుండడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి.