ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. అమరావతి పనుల ప్రారంభానికి సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2,498 కోట్లతో రహదారుల పనులు, రూ. 1508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు నిర్మాణంతో పాటు మూడు రిజర్వాయర్ల నిర్మాణం జరగనుంది. రూ.3,523 కోట్లతో అధికారుల నివాస భవనాల నిర్మాణం, 217 చదరపు కిమీ రోడ్లు, భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.