ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో ఓ భారీ వృక్షం నేలకూలింది. దీంతో పారిశుద్ధ్య సిబ్బంది చెట్టు కొమ్మలను తొలగించారు. కానీ చెట్టు మొదలులో ఉన్న మొద్దును తొలగించకుండా వదిలేశారు. గుంటూరు కలెక్టరేట్ లో రాకపోకలు సాగిస్తున్న వారికి అడ్డంకిగా మారింది. గుర్తించకుండా వచ్చిన వాహన చోదకులు ఆ మొద్దును తగులుకొని కిందపడుతున్న ఘటనలు జరుగుతున్నాయి.