గుంటూరు జిల్లా ప్రజలుశాంతియుతమైన వాతావరణంలో వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని శుక్రవారం ఎస్పీ సతీశ్ కుమార్ ఆకాంక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో విగ్రహాల ఏర్పాటుపై పీస్ కమిటీలతో చర్చిస్తామని, ఉత్సవ కమిటీ నిర్వాహకులు ట్రాఫిక్ కి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమతి తీసుకున్న వారికి పోలీసులు సహకరిస్తారన్నారు.