జగన్ శవ రాజకీయాలు మానుకో: మంత్రి సవిత
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని మంత్రి సవిత హితవు పలికారు. తండ్రి చనిపోయినప్పుడు జగన్ బాధపడలేదని, కూర్చొని సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపించారు. జగన్ హయాంలో మహిళలపై అనేక అఘాయిత్యాలు జరిగాయని, ఇందులో ఎంతమందిని జగన్ అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై సత్వరమే స్పందించి నిందితులను అరెస్ట్ చేస్తుందని చెప్పారు.